దిగుమతి సుంకం తొలగిస్తేనే టెక్స్టైల్ గట్టెక్కేది.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
- పత్తిపై 11శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలంటూ ప్రధానికి సీఎం విజయ్ లేఖ
- టెక్స్టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన
- ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతోందని ఆందోళన
- గత రెండు నెలల్లో పత్తి ధర 25 శాతం పెరిగిందని లేఖలో ప్రస్తావన
- సుంకం రద్దు చేస్తేనే పరిశ్రమ నిలదొక్కుకుంటుందని వెల్లడి
తమిళనాడులోని టెక్స్టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, దానిని ఆదుకునేందుకు పత్తిపై ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి విజయ్.. ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. పత్తి, నూలు ధరలు విపరీతంగా పెరగడంతో రాష్ట్రంలోని టెక్స్టైల్ రంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
"తమిళనాడు, దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్, దుస్తుల ఎగుమతి రాష్ట్రం. ముఖ్యంగా గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది మహిళలు ఈ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. అయితే, ఇటీవల పత్తి, నూలు ధరలు పెరగడంతో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. దేశీయంగా పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడమే ఇందుకు కారణం" అని విజయ్ తన లేఖలో పేర్కొన్నారు.
ధరల పెరుగుదల వివరాలను ఆయన తన లేఖలో స్పష్టంగా తెలిపారు. "గత రెండు నెలల్లోనే పత్తి ధర 25 శాతం పెరిగింది. ఒక క్యాండీ (సుమారు 356 కిలోలు) ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు చేరింది. అదే సమయంలో నూలు ధర కిలోకు రూ. 301 నుంచి రూ. 330కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో ముడిసరుకు కోసం దిగుమతులే ఏకైక మార్గం. అయితే, పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం ఉండటం అవరోధంగా మారింది" అని విజయ్ వివరించారు.
వ్యవసాయం తర్వాత రాష్ట్రంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్ అని గుర్తుచేసిన విజయ్, ఈ పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. "దిగుమతి సుంకాన్ని సున్నా శాతానికి తగ్గిస్తే, పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల పెరుగుతున్న ఎగుమతి ఆర్డర్లను అందుకోవడమే కాకుండా ప్రపంచ మార్కెట్లో మన పరిశ్రమ పోటీతత్వాన్ని నిలబెట్టుకోగలుగుతుంది. తద్వారా లక్షలాది ఉద్యోగాలను కాపాడవచ్చు" అని ఆయన అభ్యర్థించారు. ఈ విషయంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని సీఎం విజయ్ విజ్ఞప్తి చేశారు.